'అద్భుతం' అని ఎద్దేవా చేస్తూ.. మెట్రో రైల్ సంస్థపై మండిపడ్డ అసదుద్దీన్ ఒవైసీ
- జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో పనులు పూర్తి చేసి, ప్రారంభిస్తున్నారు
- ఇందుకు మీ వద్ద నిధులు ఉన్నాయి
- ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా పనులను ఎప్పుడు మొదలు పెడతారు?
- ఎప్పుడు పూర్తి చేస్తారు?
మెట్రోరైల్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. 'అద్భుతం.. జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో పనులు పూర్తి చేసి, ప్రారంభించడానికి మీ వద్ద నిధులు ఉన్నాయి. మరి హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా మధ్య పనులను ఎప్పుడు మొదలు పెడుతుంది? ఎప్పుడు పూర్తి చేస్తుంది?' అని ప్రశ్నించారు.