అల్లు అరవింద్ కి మాట ఇచ్చిన త్రివిక్రమ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అల్లు అరవింద్ కి మాట ఇచ్చిన త్రివిక్రమ్

  • హ్యాట్రిక్ హిట్ కొట్టిన త్రివిక్రమ్ - బన్నీ 
  • త్రివిక్రమ్ తో చర్చించిన అల్లు అరవింద్  
  • మరో సినిమాకి రెండేళ్లు పట్టే అవకాశం
త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇటీవల వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టించింది. అల్లు అర్జున్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన 'జులాయి' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' విజయాన్ని సాధించగా, 'అల వైకుంఠపురములో' సినిమాతో హ్యాట్రిక్ హిట్ దక్కింది.

దాంతో అల్లు అర్జున్ హీరోగా మరో సినిమా చేసిపెట్టమని త్రివిక్రమ్ ను అల్లు అరవింద్ కోరినట్టుగా చెబుతున్నారు. 'అల వైకుంఠపురములో' సినిమాకి సీక్వెల్ గానీ .. లేదంటే కొత్త కథను గాని సిద్ధం చేయమని అల్లు అరవింద్ చెప్పాడని అంటున్నారు. ఈ విషయంలో అల్లు అరవింద్ కి త్రివిక్రమ్ మాట ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. అయితే ఇటు త్రివిక్రమ్ కి అటు అల్లు అర్జున్ కి గల ఇతర కమిట్మెంట్స్ పరంగా చూసుకుంటే, ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రావడానికి రెండేళ్లు పట్టొచ్చు.
Trivikram
Allu Aravind

More Telugu News