నిరాశా నిస్పృహలతో ఉన్న రైతాంగానికి కొండంత అండనిచ్చే బడ్జెట్ ఇది!: పవన్ కల్యాణ్ ప్రశంసలు
- కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
- బడ్జెట్ ను స్వాగతిస్తున్నట్టు తెలిపిన జనసేనాని
- గొప్ప ఆకాంక్షలతో కూడుకున్న బడ్జెట్ అంటూ వ్యాఖ్యలు
ఈ బడ్జెట్ బలమైన ఆర్థిక ప్రగతిని సాధించేలా ఉందని, నిర్లక్ష్యానికి గురవుతున్న వర్గాలకు అండగా ఉండే బడ్జెట్ అని అభిప్రాయపడ్డారు. నిరాశా నిస్పృహలతో ఉన్న రైతాంగానికి ఇది కొండంత అండనిస్తుందనడంలో సందేహంలేదని, ఈ బడ్జెట్ ను జనసేన స్వాగతిస్తోందని పవన్ స్పష్టం చేశారు. ఉపాధి కోసం యువతకు బోలెడన్ని అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, ఆదాయపు పన్నుకు సంబంధించి 7 శ్లాబుల విధానం ఆదాయ వర్గాలకు ఊరట కలిగిస్తుందని చెప్పారు.