తండ్రి హత్య కేసును సీబీఐకి ఇవ్వాలంటూ.. హైకోర్టులో వైయస్ వివేకా కుమార్తె పిటిషన్
- ప్రతివాదులుగా సీబీఐ, ఏపీ హోంశాఖ
- ఇప్పటికే ఇవే పిటిషన్లు వేసిన మరో ముగ్గురు
- 2019 మార్చి 14న హత్యకు గురైన వివేకా
2019 మార్చి 14న తన నివాసంలోనే వైయస్ వివేకా దారుణ హత్యకు గురైన సంగతి విదితమే. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఈ కేసును సిట్ విచారిస్తోంది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఈ కేసును విచారించింది. అయితే, జగన్ సీఎం అయిన తర్వాత మరో సిట్ ను ఏర్పాటు చేశారు. కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు వైసీపీ, టీడీపీ నేతలను సిట్ అధికారులు విచారించారు.