ఆ సామాజిక వర్గాల వారే జగన్ కు భవిష్యత్ లో సమాధానం చెబుతారు: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల
- బీసీలను ఉద్ధరిస్తానని చెప్పిన జగన్ ఇదా చేసేది?
- మండలి రద్దు నిర్ణయంతో వారిని మాట్లాడనివ్వరా?
- బీసీలు ఎవరూ జగన్ ని క్షమించరు
బీసీలను, ఎస్సీలను జగన్ ఎంతగా అణగదొక్కుతున్నారో చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ అంటూ రామానాయడు మాట్లాడుతూ, కేబినెట్ ర్యాంకుతో 23 మందిని తన అడ్వయిజర్స్ పేరిట జగన్ తీసుకున్నారని, అందులో 19 మంది అగ్రవర్ణాల వారేనని, అందులోనూ ఆయనకు సంబంధించిన వర్గం వారే ఎక్కువని, కేవలం నలుగురు మాత్రం ఎస్సీ, బీసీలు మాత్రమేనని విమర్శించారు.