మండలి రద్దు నిర్ణయంపై ఎంపీ కేశినేని విమర్శలు

  • ఏపీ శాసనమండలి రద్దు నిర్ణయంపై కేశినేని స్పందన
  • వైసీపీని గెలిపించింది మాకు భయపడి పారిపోవడానికి కాదు
  • జగన్ ఇంత పిరికివాడనుకోలేదు
ఏపీ శాసనమండలిని రద్దు చేస్తామని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంపీ కేశినేని నాని స్పందిస్తూ, మొన్నటి ఎన్నికల్లో వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించింది తమ 28 మంది ఎమ్మెల్సీల దెబ్బకు భయపడి పారిపోవడానికి కాదని విమర్శించారు. జగన్ ధైర్యంగా నిలబడి పోరాడతారని అనుకుంటే ఇంత పిరికివాడని అనుకోలేదని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Telugudesam
Kesineni Nani
mp
Jagan
cm

More Telugu News