మంచికోసం పోరాడే చెడ్డవాడిగా రానా!
- రానా తాజా చిత్రంగా 'విరాటపర్వం'
- నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే కథ
- కొత్తగా కనిపించనున్న సాయిపల్లవి
పదిమందికి మంచి జరగాలనే ఉద్దేశంతో పోరాడే చెడ్డ వ్యక్తిగా రానా కనిపించనున్నాడని చెబుతున్నారు. ఈ పాత్ర రానా కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో సాయిపల్లవి పాత్ర కూడా కొత్తగా ఉంటుందనీ, ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అవుతుందని అంటున్నారు. రానా - సాయిపల్లవి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది. ఈ కాంబినేషన్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.