మా బ్యానర్ పై ‘83’ చిత్రం విడుదల కానుండటం సంతోషం: అక్కినేని నాగార్జున
- 1983 క్రికెట్ వరల్డ్ కప్ ను భారత్ దక్కించుకోవడం మరవలేం
- ఆ క్షణాలు తలచుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుస్తాయి
- ఓ ట్వీట్ చేసిన నాగార్జున
ఈ సందర్భంగా నాగార్జున అక్కినేని స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. 1983లో భారత్ తొలిసారిగా ప్రపంచకప్ ను కైవసం చేసుకున్న క్షణాలను తలచుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయని అన్నారు. తెలుగు వర్షన్ ‘83’ను తమ బ్యానర్ లో విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. కాగా, ఏప్రిల్ 10వ తేదీన ‘83’ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.