మండలికి తాగొచ్చారన్న యనమల వ్యాఖ్యలపై బొత్స స్పందన
- యనమల ఆరోపణలు సరికాదు
- మండలిలో టీడీపీ ఇష్టానుసారం వ్యవహరిస్తోంది
- ప్రజాబలంతో తాము ముందుకు వెళ్తాం
అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులను మండలిలో అడ్డుకోవడం సరికాదని బొత్స అన్నారు. సంఖ్యాబలం ఉందని మండలిలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్టుగానే మండలి ఛైర్మన్ షరీఫ్ వ్యవహరించారని మండిపడ్డారు. రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచారని దుయ్యబట్టారు. సూచనలు చేయాల్సిన మండలిలో... బిల్లులను అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. వికేంద్రీకరణ బిల్లు ఆమోదానికి కొంత ఆలస్యం జరగవచ్చని... అంతకంటే టీడీపీ చేసేదేమీ లేదని అన్నారు. ప్రజాబలంతో తాము ముందుకెళ్తామని చెప్పారు.