Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

షార్ట్స్‌లో చూడండి
 *  ప్రస్తుతం అటు సినిమాలలో నటిస్తూనే, మరోవైపు వెబ్ సీరీస్ లో కూడా నటిస్తున్న అందాలతార సమంత తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. టీవీ కోసం ఓ టాక్ షో చేయడానికి ఈ ముద్దుగుమ్మ ఓకే చెప్పిందట. ఆ వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
*  ఇటీవల రాజకీయాలలో బిజీగా వున్న పవన్ కల్యాణ్  తాజాగా రెండు సినిమాలలో నటించడానికి ఓకే చెప్పారు. అందులో 'పింక్' రీమేక్ ఒకటి కాగా, క్రిష్ దర్శకత్వంలో నటించేది మరొకటి. తాజా సమాచారం ప్రకారం, క్రిష్ తో చేసే సినిమా నిర్మాణంలో తాను భాగం కావాలని పవన్ నిర్ణయించుకున్నారట. అంటే, పారితోషికం తీసుకోకుండా, నిర్మాణంలో షేర్ తీసుకుంటారట.
*  రానా టైటిల్ పాత్రలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్యకశిప' చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రానా నటిస్తున్న 'విరాటపర్వం' చిత్రం మరో నెల రోజుల్లో పూర్తికానుంది. ఆ తర్వాత వేసవి నుంచి హిరణ్యకశిప షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 150 కోట్ల బడ్జెట్టుతో సురేశ్ బాబు నిర్మిస్తున్నారు.
Go Back to Shorts
Samantha
Pawan Kalyan
Krish
Rana

More Telugu News