కాంగ్రెస్‌తో కలవాలనే ఉద్దేశంతోనే జగన్ వైఖరి మార్చుకుంటున్నారా?: శ్రీకృష్ణదేవరాయలు
- ఓటర్ల జాబితా సవరణపై జగన్ ది ద్వంద్వ వైఖరి అంటూ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఫైర్
- గతంలో కోర్టులో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటమేంటని ప్రశ్న
- ఈసీల నియామకంపై మాట మార్చడం వెనుక ఆంతర్యమేమిటని నిలదీత
- 2029లో కాంగ్రెస్‌తో పొత్తు కోసమే జగన్ వ్యూహాలని ఆరోపణ
వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ది అవకాశవాద, ద్వంద్వ వైఖరి అని ఆరోపిస్తూ సోషల్ మీడియా వేదికగా పలు కీలక ప్రశ్నలు సంధించారు. ఆయన రాజకీయ సౌలభ్యం కోసం వైఖరులు మార్చుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్, గతంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇదే ప్రక్రియను ప్రామాణికంగా తీసుకున్నారని లావు గుర్తుచేశారు.
"ఎస్ఐఆర్ పూర్తయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మీ పార్టీ ఎమ్మెల్సీ లెళ్ల అప్పిరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం వాస్తవం కాదా? కోర్టులో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటంలోని ఆంతర్యమేమిటి?" అని ఆయన ప్రశ్నించారు.
అదేవిధంగా, ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని (సీజేఐ) తొలగిస్తూ 2023లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టానికి వైసీపీ మద్దతు ఇచ్చిందని లావు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు, ప్రధాని, ప్రతిపక్ష నేతతో పాటు సీజేఐ కూడా ప్యానెల్‌లో ఉండాలని జగన్ డిమాండ్ చేయడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
ఈ ఆకస్మిక మార్పుల వెనుక రాజకీయ వ్యూహం ఉందని లావు అనుమానం వ్యక్తం చేశారు. 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, తన మాతృ సంస్థ అయిన కాంగ్రెస్‌తో రాజకీయంగా కలవాలనే ఉద్దేశంతోనే జగన్ ఇలా తన వైఖరిని మార్చుకుంటున్నారా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.