రూల్స్ గురించి వాళ్ల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు... మేం అడిగితే సెలెక్ట్ కమిటీకి పంపాల్సిందే: యనమల
- రూల్స్ గురించి వైసీపీ వాళ్లు చెప్పనవసరంలేదన్న యనమల
- మెజారిటీ సభ్యులు ఏంకోరితే చైర్మన్ అదే చేస్తారని వెల్లడి
- సర్వాధికారం చైర్మన్ దేనని వ్యాఖ్యలు
మండలి వాయిదా విరామంలో మాట్లాడిన ఆయన, కౌన్సిల్ లో తమకు సంఖ్యాబలం ఉందని, తాము కోరితే బిల్లును సెలెక్ట్ కమిటీ ముందుకు పంపాల్సిందేనని స్పష్టం చేశారు. కావాలనుకుంటే ఈ అంశంపై ఓటింగ్ నిర్వహించుకోవచ్చని అన్నారు. ఎక్కడైనా మెజారిటీ సభ్యులు ఏ అంశం కోరుకుంటే చైర్మన్ దాన్నే పాటిస్తారని స్పష్టం చేశారు. అయినా రూల్స్ గురించి వైసీపీ నుంచి తాము నేర్చుకోవాల్సిన అవసరంలేదని, మండలిలో సర్వాధికారం చైర్మన్ దేనని యనమల ఉద్ఘాటించారు.