లైవ్ నిలిపివేయడంతో స్వయంగా మండలికి వెళ్లిన చంద్రబాబు

  • మండలిలో వాడీవేడి చర్చ
  • ప్రత్యక్ష ప్రసారం నిలిపివేత
  • మండలి గ్యాలరీలో కూర్చున్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ శాసనమండలిలో అడుగుపెట్టారు. ఆయన గ్యాలరీలో ఉండి సమావేశాలను తిలకించారు. వాస్తవానికి చంద్రబాబు అసెంబ్లీలోని తన చాంబర్ లో కూర్చుని మండలి సమావేశాలను వీక్షిస్తుండగా, ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారు. దాంతో ఆయన స్వయంగా మండలికి వెళ్లారు. లైవ్ టెలికాస్ట్ ఆపేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే మండలి సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కాగా, ఏపీకి మూడు రాజధానుల బిల్లుపై మండలిలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ బిల్లును టీడీపీ వ్యతిరేకిస్తుండగా, బిల్లును ఆమోదింపచేసుకునేందుకు వైసీపీ అన్ని మార్గాలను  వెతుకుతోంది.
Go Back to Shorts
Andhra Pradesh
Amaravati
AP Capital
Chandrababu
AP Legislative Council
Live
YSRCP
Telugudesam

More Telugu News