రికార్డులు బద్దలుకొడుతున్న 'అల వైకుంఠపురములో' కలెక్షన్లు.. 10 రోజుల వసూళ్ల వివరాలు ఇవిగో!

  • 10 రోజుల్లో రూ. 220 కోట్ల గ్రాస్
  • రూ. 143 కోట్ల షేర్ సాధించిన బన్నీ సినిమా
  • నాన్ బాహుబలి సినిమాల రికార్డు బద్దలు
అల్లు అర్జున్, పూజా హెగ్డే, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సంక్రాంతి సందర్భంగా విడుదలైన 'అల వైకుంఠపురములో' బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. సినిమా విడుదలకు ముందే ఈ సినిమా పాటలు జనాల్లోకి వెళ్లిపోయాయి. సినిమా విడులైన తర్వాత తొలి షోతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. చిత్ర నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కాసుల పంట పండిస్తోంది. నాన్ బాహుబలి సినిమాల్లో అత్యధిక కలెక్షన్లను సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. 10 రోజుల్లో ఏకంగా రూ. 220 కోట్ల గ్రాస్, రూ. 143 కోట్ల షేర్ ను సాధించింది.

'అల వైకుంఠపురములో' వసూళ్ల వివరాలు (కోట్లలో):
నైజాం - 35.69
సీడెడ్ - 18.07
వైజాగ్ - 18.80
గుంటూరు - 9.93
తూర్పుగోదావరి - 9.89
పశ్చిమగోదావరి - 7.65
కృష్ణా - 8.80
నెల్లూరు - 4.07
మొత్తం తెలుగు రాష్ట్రాలు - 112.90

కర్ణాటక - 10.70
తమిళనాడు, కేరళ, ఇతర రాష్ట్రాలు - 3.60
అమెరికా - 12.50
ఇతర దేశాలు - 3.55
మొత్తం షేర్ - 143.25.
Go Back to Shorts
Ala Vaikunthapuramulo Movie
Collections
Allu Arjun
Pooja Hegde
Trivikram Srinivas
Tollywood

More Telugu News