నిబంధన 71 దెబ్బకు.. సీఎం జగన్, మంత్రులు విలవిల్లాడుతున్నారు: టీడీపీ నేత దేవినేని ఉమ
- ప్రభుత్వ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా అయింది
- 23వ తేదీకల్లా జగన్ మూడు రాజధానుల ముచ్చట తీరిపోతుంది
- మంత్రులు వీధిరౌడీల్లా ప్రవర్తించారు
కుర్రచేష్టలతో విర్రవీగుతున్న బుర్రలేని మంత్రులకు తన 40 ఏళ్ల అనుభవం ఎలా ఉంటుందో చంద్రబాబు చూపించారని దేవినేని ఉమ అన్నారు. విజయసాయిరెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డికి మండలిలో ఏం పని? అని దేవినేని ఉమా ప్రశ్నించారు. 23వ తేదీకల్లా సీఎం జగన్ కు మూడు రాజధానుల ముచ్చట తీరిపోతుందని పేర్కొన్నారు. ఆ తేదీ నుంచి జగన్ కు ఏలినాటి శని ఆరంభమవుతుందన్నారు.