ప్రజల మనోభావాలు తెలుసుకోకపోతే మట్టికరుస్తారు: జగన్ కు కేశినేని హెచ్చరిక
- ఇది ఒక దుర్మార్గపు పాలన
- ప్రజలు తగిన సమయంలో బుద్ధిచెబుతారు
- నన్ను ఏ విధంగా హౌస్ అరెస్ట్ చేస్తారు?
రైతులను, ప్రతిపక్ష నేతలను, మేధావులను అరెస్టు చేయడం తగదని, ఒక ఎంపీని అయిన తనను ఏ విధంగా హౌస్ అరెస్ట్ చేస్తారు? అని ప్రశ్నించారు. తన విధులు నిర్వర్తించకుండా చేయడం నేరం అని పోలీసులపై మండిపడ్డారు. రాష్ట్రానికి మంచి చేయాలన్న తలంపుతో ప్రభుత్వం పనిచేయాలే తప్ప కుల, మత ప్రాతిపదికగా పనిచేయడం కరెక్టు కాదని అన్నారు.
ఏ ప్రాంతం వారైనా తమ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటారని, నిన్న వైసీపీ ఎమ్మెల్యేలు నిర్వహించిన ర్యాలీ ఇందుకు భిన్నంగా ఉందని, ప్రజాప్రతినిధులు సిగ్గుపడేలా ఉందని మండిపడ్డారు. అమరావతిలో అభివృద్ధి వద్దని, ఆ అభివృద్ధిని విశాఖ, కర్నూలులో చేయాలని కోరుతూ ఈ ర్యాలీ నిర్వహించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా, రాజధాని మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేశినేని నాని డిమాండ్ చేశారు.