చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి: శ్రీకాంత్ రెడ్డి
- చంద్రబాబు విద్వేషాలను రెచ్చగొడుతున్నారు
- అమరావతి అభివృద్ధికి చంద్రబాబు చేసిందేమీ లేదు
- రాయలసీమలో హైకోర్టు పెడితే అభ్యంతరం ఎందుకు?
ఇన్సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ విచారణకు అప్పగిస్తారని చంద్రబాబు భయపడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆ భయంతోనే రైతులను రెచ్చగొడుతున్నారని చెప్పారు. రాయలసీమలో హైకోర్టు పెడుతుంటే చంద్రబాబుకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. శ్రీశైలం ప్రాజెక్టు కోసం ఆ ప్రాంత రైతులు 80 వేల ఎకరాలను త్యాగం చేశారని... ఆ విషయం చంద్రబాబుకు గుర్తు లేదా? అని అడిగారు.