కావాలంటే మీరు కూడా వాళ్లకు మెయిల్ పెట్టుకోండి: మద్రాస్ ఐఐటీ నివేదికపై ప్రశ్నకు బొత్స
- మేము చెప్పేవన్నీ అబద్ధాలే అంటారా?
- ఓ పత్రికలో వచ్చే కథనాలపై నేను ఏం మాట్లాడాలి?
- అసెంబ్లీని చంద్రబాబే తాత్కాలిక భవనం అన్నారు
'మేము చెప్పేవన్నీ అబద్ధాలే అంటారా?' అని ప్రశ్నించిన బొత్స... 'కావాలంటే మీరు ఐఐటీ మద్రాస్ కు మెయిల్ పెట్టుకోండి' అని వ్యాఖ్యానించారు. శివరామకృష్ణన్ కమిటీ కూడా అబద్ధమేనా? అని ప్రశ్నించారు. ఓ పత్రికలో వచ్చే కథనాలపై తాను ఏం మాట్లాడగలనని అడిగారు. అసెంబ్లీని చంద్రబాబే తాత్కాలిక భవనం అని చెప్పారని... అలాంటప్పుడు దాన్ని తాము శాశ్వత భవనమని ఎలా అనగలమని ప్రశ్నించారు. చంద్రబాబుకు కేవలం ఆయన సామాజికవర్గంపైనే అంకితభావం ఉందని విమర్శించారు.