అల్లు అర్జున్, త్రివిక్రమ్ కెరీర్ లో ఇదే టాప్.... 'అల... వైకుంఠపురములో' వసూళ్ల రికార్డు
- తొలి రోజు వరల్డ్ వైడ్ రూ.85 కోట్ల గ్రాస్
- బన్నీ సినిమాల్లో ఇదే హయ్యస్ట్ ఓపెనింగ్
- అత్యధిక తొలిరోజు కలెక్షన్లు సాధించిన టాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా ఘనత
ఈ ఫ్యామిలీ ఎంటర్టయినర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున రూ.85 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అల్లు అర్జున్ కెరీర్ లో ఇప్పటివరకు ఇదే హయ్యస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. అంతేకాదు, దర్శకుడు త్రివిక్రమ్ గత చిత్రాలేవీ ఈ స్థాయిలో తొలిరోజు కలెక్షన్లు సాధించలేదంటే 'అల... వైకుంఠపురములో' సినిమా ఏ రేంజ్ లో బాక్సాఫీసు వద్ద సందడి చేస్తోందో అర్థమవుతోంది. అంతేకాదు, తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు భారీ ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టిన చిత్రాల సరసన అల్లు అర్జున్ చిత్రం కూడా చేరింది.