'కోబ్రా'గా 25 గెటప్స్ లో కనిపించనున్న విక్రమ్!
- విక్రమ్ తదుపరి చిత్రంగా 'కోబ్రా'
- దర్శకుడిగా అజయ్ జ్ఞానముత్తు
- ప్రస్తుతం కోల్ కతాలో షూటింగ్
కానీ విక్రమ్ మాత్రం విశ్రాంతి తీసుకోలేదు. 'కోబ్రా' సినిమా కోసం వెంటనే ఆయన కోల్ కతా వెళ్లాడు. ఆయన కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ 25 గెటప్స్ లో కనిపిస్తాడట. ఒక గెటప్ కి మరో గెటప్ కి మధ్య ఎలాంటి పోలిక లేకుండా చకచకా గెటప్స్ మార్చేస్తూ ఉంటాడని అంటున్నారు. ఈ అంశమే ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.