Andhra Pradesh: ఏపీలో పరిస్థితి పట్ల ఓ తెలంగాణ వ్యక్తిగా సంతోషిస్తున్నా... కానీ!: రేవంత్ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో ఓవైపు రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తుండగా, మరోవైపు మూడు రాజధానుల అంశంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఏపీ పరిస్థితులపై స్పందించారు. అన్నదమ్ములుగా ఉన్న రాష్ట్రంలో నేడు సంక్షోభం నెలకొందని, కేవలం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి లాభం చేకూర్చేందుకే గందరగోళ పరిస్థితులు సృష్టించారని ఆరోపించారు.

అయితే, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత పుంజుకుందని తెలిపారు. ఓ తెలంగాణ వ్యక్తిగా ఈ పరిణామం తనకు ఎంతో సంతోషం కలిగిస్తోందని, కానీ ఏపీ పరిస్థితి చూస్తుంటే ఓ భారత పౌరుడిగా ఎంతో బాధగా ఉందని వివరించారు. ప్రస్తుతం ఏపీ కుప్పకూలే పరిస్థితిలో ఉందని అన్నారు. ఏపీ తిరోగమనం వల్ల తెలంగాణ లాభపడుతుందని రేవంత్ అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telangana
Hyderabad
Revanth Reddy
Congress

More Telugu News