అల్లు అర్జున్ కు బ్లాక్ బస్టర్ కంగ్రాచ్యులేషన్స్: గంటా శ్రీనివాసరావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అల్లు అర్జున్ కు బ్లాక్ బస్టర్ కంగ్రాచ్యులేషన్స్: గంటా శ్రీనివాసరావు

  • బన్నీ హీరోగా నటించిన అల... వైకుంఠపురములో చిత్రం రిలీజ్
  • స్పందించిన గంటా శ్రీనివాసరావు
  • బన్నీకి, చిత్రబృందానికి శుభాభినందనలు
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అల... వైకుంఠపురములో చిత్రం గ్రాండ్ సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టయినర్ చిత్రంపై మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఈ చిత్ర హీరో అల్లు అర్జున్ కు బ్లాక్ బస్టర్ కంగ్రాచ్యులేషన్స్ అంటూ గంటా ట్వీట్ చేశారు. అల... వైకుంఠపురములో చిత్రబృందం మొత్తానికి శుభాభినందనలు తెలిపారు. అల... వైకుంఠపురములో చిత్రం అద్వితీయమైన విజయం నమోదు చేసిందని పేర్కొన్నారు.

అటు, హీరో అల్లు అర్జున్ కూడా తన చిత్రం ఘనవిజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయంటూ ట్విట్టర్ లో స్పందించారు. థాంక్యూ, థాంక్యూ , థాంక్యూ... అంటూ సంతోషం వెలిబుచ్చారు.
Allu Arjun
Ganta Srinivasa Rao
Ala Vaikunthapuramulo
Trivikram
Tollywood

More Telugu News