ముద్దాడబోయిన అభిమాని... సారా అలీ ఖాన్ కు చేదు అనుభవం... వీడియో ఇదిగో!
- ముంబైలో ఘటన
- జిమ్ కు వెళ్లి వస్తున్న వేళ సెల్ఫీలు
- అతిగా ప్రవర్తించిన అభిమాని
జిమ్ నుంచి సారా బయటకు రాగానే, అక్కడే వేచివున్న మీడియా, కొన్ని స్టిల్స్ ఇవ్వాలని కోరగా, ఆమె ఇస్తూ నిలబడింది. ఈలోగా కొందరు ఆమెను సెల్ఫీలు అడిగితే ఇచ్చింది. అదే సమయంలో మరో అభిమాని వచ్చి, ఆమెతో కరచాలనాన్ని కోరాడు. ఆమె చేతిని అందించగా, ముద్దాడబోయాడు. వెంటనే అక్కడి సెక్యూరిటీ, అతన్ని కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని మీరు కూడా చూడవచ్చు.