నీ పతనం కూడా మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారు: కేశినేని నాని
- ప్రజాస్వామ్యాన్ని జగన్ ఖూనీ చేస్తున్నారు
- రాష్ట్రంలో మిలిటరీ పాలన చేస్తున్నారు
- రైతుల రక్తంతో అమరావతి ప్రాంతం ఎర్రగా మారింది
నియంతృత్వ ధోరణి కలిగిన ఎందరో నియంతలు మట్టిలో కలిసిపోయారని... నీ పతనం కూడా కూడా మొదలైంది జగన్మోహన్ రెడ్డిగారూ అంటూ వ్యాఖ్యానించారు. రాజధాని కోసం పోరాడుతున్న రైతుల నుంచి చిందుతున్న రక్తంతో అమరావతి ప్రాంతం ఎర్రగా మారిందని అన్నారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న నిరసనకారులపై పోలీసుల అండతో ప్రభుత్వం అకృత్యాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.