దాడిలో నిజమైన రైతులు లేరు.. విద్యార్థులపై కేసులు పెట్టొద్దు: వైసీపీ నేత ఎస్ఏ రెహమాన్
- ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాడిని ఖండిస్తున్నా
- విద్యార్థులను చంద్రబాబు రోడ్డెక్కిస్తున్నారు
- 33 వేల ఎకరాల భూమితో ఈ ప్రభుత్వానికి సంబంధమేమిటి?
టీడీపీ హయాంలో రైతులు ఇచ్చిన 33 వేల ఎకరాల భూమితో ఈ ప్రభుత్వానికి సంబంధమేమిటని రెహమాన్ ప్రశ్నించారు. పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదమని చెప్పారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామన్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు. రాజధాని ఎక్కడుండాలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని బీజేపీ నేతలే చెబుతున్నారని గుర్తు చేశారు.