Prabhas: 'జాన్' సినిమా నుంచి తప్పుకున్న సంగీత దర్శకుడు

షార్ట్స్‌లో చూడండి
ప్రభాస్ కథానాయకుడిగా 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ను రూపొందిస్తున్నాడు. లవర్ బాయ్ గా .. దొంగగా ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకి 'జాన్' అనే టైటిల్ పరిశీలనలో వుంది. విభిన్నమైన కథాకథనాలతో కూడిన ఈ సినిమాను, యూవీ క్రియేషన్స్ వారితో కలిసి కృష్ణంరాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొంతవరకూ జరిగింది.

ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా 'అమిత్ త్రివేది'ని తీసుకున్నారు. బాలీవుడ్లో అమిత్ త్రివేదికి మంచి పేరు వుంది. ఇటీవల వచ్చిన 'సైరా' నరసింహా రెడ్డి' సినిమాకి అందించిన సంగీతంతో, ఇక్కడి ప్రేక్షకుల మనసులను కూడా ఆయన కొల్లగొట్టాడు.'జాన్' సినిమా నుంచి ఆయన తప్పుకున్నాడనేది తాజా సమాచారం. ఈ సినిమా షెడ్యూల్స్ ప్లానింగ్ లో మార్పు రావడం వలన, ఆయనకి డేట్స్ సర్దుబాటు చేయలేని పరిస్థితి వచ్చిందట. అందువల్లనే ఆయన తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది చూడాలి.
Go Back to Shorts
Prabhas
Pooja Hegde

More Telugu News