పవన్ కల్యాణ్ పై గుడివాడ అమర్ నాథ్ సెటైర్లు
- హైదరాబాదుకు వెళ్లిన వెంటనే పవన్ మాట మార్చారు
- చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు
- అశోక్ రాజులా కాకుండా బంటులా వ్యవహరిస్తున్నారు
విశాఖను రాజధానిగా విమర్శించే టీడీపీ నాయకులంతా ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారని అమర్నాథ్ చెప్పారు. చంద్రబాబు మాటలు విని అశోక్ గజపతిరాజు, కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అశోక్ గజపతిరాజు ఒక రాజులా కాకుండా ఒక బంటుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.