విమానంలో సీటు కింద బొద్దింక... ఇండిగో సంస్థకు రూ.50 వేలు జరిమానా
- సిబ్బంది నిర్లక్ష్యం
- అధికారులదీ అదే తీరు
- కన్స్యూమర్ కోర్టులో జరిగిన న్యాయం
దాంతో ఆ ప్రయాణికులు బొద్దింకను ఫొటో తీసి ఇండిగో అధికారులకు చూపించగా, వారు సైతం అదేమీ పెద్ద విషయం కాదని తేలిగ్గా తీసిపారేశారు. ఈ నేపథ్యంలో అసీమ్, సురభి కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించగా ఇండిగో సంస్థను రూ.50 వేలు నష్టపరిహారంతోపాటు వారి టికెట్ చార్జీకి వడ్డీ కలిపి ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. అంతకుముందు కూడా కాస్తంత తతంగం నడిచింది. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు కన్స్యూమర్ కోర్టు ఇండిగో సంస్థకు నోటీసుల మీద నోటీసులు పంపినా ఇండిగో అధికారులు హాజరుకాలేదు. దాంతో న్యాయమూర్తి ఇండిగో సంస్థకు జరినామా విధించారు.