ఎమ్యెల్యే జోగు రామన్నపై ఎంపీ సోయం బాపూరావు ఫైర్
- రామన్న అనవసర విమర్శలు చేస్తే ఊరుకోను
- తలుచుకుంటే ఎమ్మెల్యే జోగు రామన్నకు టికెట్ రాకుండా చేస్తా
- సీసీఐను పున:ప్రారంభించడంలో టీఆర్ఎస్ విఫలమైంది
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జోగు రామన్న వైఖరిని తూర్పారబట్టారు. జోగు రామన్న తనపై అనవసర విమర్శలు చేస్తే ఊరుకోమని చెప్పారు. తాను తలుచుకుంటే ఎమ్మెల్యే జోగు రామన్నకు టికెట్ రాకుండా చేస్తానని హెచ్చరించారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తానని సోయం వెల్లడించారు. భూ నిర్వాసితులతో కలిసి ప్రధాని మోదీకి దీనిపై నివేదిస్తామన్నారు.