అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా చేయాలన్నదే చంద్రబాబు ఆలోచన: కేశినేని నాని
- 34 వేల ఎకరాలు ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదు
- అనేక మంది రైతుల త్యాగం అమరావతి
- రాజధాని తరలింపును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోము
అనేక మంది రైతుల త్యాగం అమరావతి అని కేశినేని నాని అన్నారు. రాజధాని తరలింపును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని స్పష్టం చేశారు. రైతుల పట్ల వ్యతిరేక వైఖరి ప్రదర్శించే ఏ ప్రభుత్వం మనుగడ సాగించబోదని ఆయన అన్నారు. రాజధాని కోసం, రైతుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని వ్యాఖ్యానించారు.