న్యూ మూవీ అప్ డేట్... దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగిగా మెగాస్టార్ చిరంజీవి!
- రామ్ చరణ్ నిర్మాతగా 152వ చిత్రం
- హీరోయిన్ గా నటించనున్న త్రిష
- స్వరాలను సమకూర్చనున్న మణిశర్మ
ఇందుకు సంబంధించిన లుక్ కోసం చిరంజీవి నిత్యమూ జిమ్ లో శ్రమిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటించనుంది. ఫిబ్రవరిలోగా, ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటినీ ఎంటర్ టెయిన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందించనున్నారు.