ఎమ్మెల్యే ఆర్కే అందుబాటులో లేకపోవడంతో ఇంటికి వినతిపత్రం అంటించిన రైతులు
- ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లిన రైతులు
- రైతులకు నిరాశ
- అమరావతిని రాజధానిగా కొనసాగించాలని విజ్ఞప్తి
దీనిపై ఎమ్మెల్యే ఆర్కే వివరణ ఇస్తూ, వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్ వెళితే ఇంత రాద్ధాంతమా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లిన రాజధాని రైతులకు నిరాశే మిగిలింది. ఎమ్మెల్యే ఆర్కే అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటికి వినతిపత్రాన్ని అంటించారు. ఇచ్చిన మాట ప్రకారం రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని, రాజధాని అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు.