కటక్ వన్డేలో టీమిండియా సూపర్ చేజింగ్... సిరీస్ కైవసం
- మూడో వన్డేలో భారత్ విజయం
- 2-1తో సిరీస్ వశం
- రాణించిన టీమిండియా టాపార్డర్
- చివర్లో ఆకట్టుకున్న జడేజా, ఠాకూర్
ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-1తో చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 315 పరుగులు చేసింది. యువ ఆటగాడు నికోలాస్ పూరన్ 89, కెప్టెన్ కీరన్ పొలార్డ్ 74 పరుగులతో రాణించారు.