ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని అన్నకు తమ్ముడి ఓదార్పు!
- కోల్ కతాలో ఐపీఎల్ ఆటగాళ్ల వేలం
- అమ్ముడుపోని యూసుఫ్ పఠాన్
- నువ్వు మ్యాచ్ విన్నర్ అంటూ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్
తాజాగా నిర్వహించిన వేలంలో యూసుఫ్ పఠాన్ వైపు ఒక్క ఫ్రాంచైజీ కూడా మొగ్గు చూపలేదు. అతడి కనీసధర రూ.1 కోటి. వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో మాత్రం చోటు దక్కించుకున్నాడు. దీనిపై యూసుఫ్ తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. తన అన్న పరిస్థితిని ఊహించి ఊరట వచనాలు పలికాడు. ఇలాంటి చిన్న అంశాలతో నీ కెరీర్ ను తక్కువచేసి చూడలేం. నువ్వో రియల్ మ్యాచ్ విన్నర్ వి. లాలా, నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా.. అంటూ ట్వీట్ చేశాడు.