RasiKanna: సినీ హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి మొక్కలు నాటిన హీరోయిన్ రాశి ఖన్నా

షార్ట్స్‌లో చూడండి
టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు మొక్కలు నాటారు. ఈ రోజు సినీనటుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి హీరోయిన్ రాశి ఖన్నా మొక్కలు నాటారు.
    సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా దర్శకుడు మారుతి రూపొందించిన 'ప్రతిరోజూ పండగే' చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో ఆ చిత్ర బృందం పాల్గొంది. పరిసరాలను పచ్చగా, పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ ఈ ఛాలెంజ్ స్వీకరించాలని రాశి ఖన్నా కోరింది. మొక్కలు నాటిన ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.        
Go Back to Shorts
RasiKanna
Green Challenge
Telangana

More Telugu News