మూడు రాజధానుల వల్ల తమ దేశం నష్టపోతోందని దక్షిణాఫ్రికా వారు మొత్తుకుంటున్నారు: కేశినేని నాని
- మూడు రాజధానుల యోచనపై కేశినేని విమర్శలు
- దక్షిణాఫ్రికా నేతలు కూడా వద్దనుకుంటున్నారని వ్యాఖ్య
- మన ఏపీకి మూడు రాజధానులు ఎందుకు సీఎం గారూ? అని ప్రశ్న
'సౌత్ ఆఫ్రికా వారు మూడు రాజధానుల వల్ల తమ దేశం నష్టపోతుందని మొత్తుకుంటుంటే మన ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఎందుకు ముఖ్యమంత్రి గారూ?' అని కేశినేని నాని ప్రశ్నించారు. కాగా, ఏపీ పాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, చట్టసభలతో ‘అమరావతి’ని రాజధానిగా చేయాలని జగన్ చెప్పిన విషయం తెలిసిందే.