వైజాగ్ వన్డేలో సెంచరీలు బాదిన రోహిత్, రాహుల్... తొలి బంతికే కోహ్లీ అవుట్
- వైజాగ్ లో వన్డే మ్యాచ్
- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్
- ధాటిగా ఆడిన టీమిండియా ఓపెనర్లు
ఈ క్రమంలో రోహిత్ మొదట సెంచరీ పూర్తిచేసుకోగా, ఆ తర్వాత రాహుల్ కూడా 100 మార్కు అధిగమించాడు. టీమిండియా ఓపెనింగ్ జోడీని విడదీసేందుకు విండీస్ బౌలర్లు చేయని ప్రయత్నమంటూ లేదు. కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఆరుగురు బౌలర్లను ప్రయోగించినా సెంచరీలు చేయకుండా నిరోధించలేకపోయారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 37.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 232 పరుగులు. కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఆడిన తొలి బంతికే వెనుదిరగడంతో వైజాగ్ ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ (120) కు జతగా అయ్యర్ ఉన్నాడు.