dk aruna: ఢిల్లీకి బయల్దేరిన డీకే అరుణ

తెలంగాణ పొలిటికల్ ఫైర్ బ్రాండ్ డీకే అరుణ ఢిల్లీ వెళ్లారు. రెండు రోజుల పాటు ఆమె ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. తన పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఆమె భేటీ కానున్నారు. పలువురు బీజేపీ పెద్దలను కూడా ఆమె కలవనున్నారు.

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఆమె ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా లక్ష్మణ్ పదవీకాలం ముగియనుండటంతో... ముఖ్యమంత్రి కేసీఆర్ ను దీటుగా ఎదుర్కోగల నేత కోసం బీజేపీ హైకమాండ్ అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో, డీకే అరుణ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది.

dk aruna
bjp
delhi

More Telugu News