Guntur: గుంటూరులో అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: చంద్రబాబు డిమాండ్

షార్ట్స్‌లో చూడండి
గుంటూరులో బాలికపై అత్యాచారం ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఖండించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో బాలికను పరామర్శించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, బాధితురాలి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలి పేరిట రూ.25 లక్షల ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని, ఆమె ఉన్నత విద్య పూర్తయ్యే వరకూ ప్రభుత్వమే ఆ ఖర్చులు భరించాలని, ఏఎన్ఎంగా పని చేస్తున్న బాధితురాలి తల్లికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వారికి ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు, ఇటీవల మృతి చెందిన గుంటూరు డిప్యూటీ మేయర్ రాజేంద్రప్రసాద్ కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు.
Go Back to Shorts
Guntur
Molestaion
Chandrababu
Telangana

More Telugu News