నా లవర్ గౌతమ్ ను ప్రేమికుల రోజున మీ ముందుంచుతా: రాశి ఖన్నా
- మరో ప్రేమకథగా 'వరల్డ్ ఫేమస్ లవర్'
- యామిని పాత్రలో రాశి ఖన్నా
- ఫిబ్రవరి 14వ తేదీన విడుదల
తాజాగా రాశి ఖన్నా పోస్టర్ ను వదిలారు. విజయ్ దేవరకొండను ఆమె ప్రేమగా హత్తుకున్న ఈ పోస్టర్ యూత్ ను ఆకట్టుకునేలా వుంది. 'మీట్ మై వరల్డ్ ఫేమస్ లవర్ గౌతమ్ .. ఇతన్ని ప్రేమికుల రోజున మీ ముందుంచుతాను' అని రాశి ఖన్నా ట్వీట్ చేసింది. ఫిబ్రవరి 14వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాలో, యామినిగా రాశి ఖన్నా .. గౌతమ్ గా విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు.