సానియా మీర్జా సోదరి పెళ్లి రిసెప్షన్ లో రామ్ చరణ్, ఉపాసన జోడీ సందడి

  • అజహర్ తనయుడితో సానియా చెల్లి పెళ్లి
  • హైదరాబాద్ లో రిసెప్షన్
  • హాజరైన ప్రముఖులు
టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ తనయుడు అసద్, టెన్నిస్ రారాణి సానియా మీర్జా సోదరి ఆనమ్ ల వివాహం ఘనంగా జరిగింది. వీరి పెళ్లి రిసెప్షన్ గురువారం శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు అనేక రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేశారు. టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్, ఆయన అర్ధాంగి ఉపాసన కూడా ఈ విందుకు హాజరయ్యారు. సానియా మిత్రబృందంలో రామ్ చరణ్, ఉపాసన కూడా ఉన్నారు. వీరు ఎప్పటినుంచే స్నేహితులు. ఈ నేపథ్యంలో సానియా చెల్లిలి పెళ్లి విందులో చరణ్, ఉపాసన సందడి చేశారు. అజహరుద్దీన్ తోనూ చరణ్ దంపతులు ఎంతో హుషారుగా ముచ్చటిస్తూ కనిపించారు.
Go Back to Shorts
Sania Mirza
Ramcharan
Upasana
Tollywood
Azharuddin
Asad
Anam Mirza

More Telugu News