Nani: అన్నంత పని చేసిన 'నానిగాడు' హీరో... ఫిల్మ్ చాంబర్ ముందు ఆత్మహత్యాయత్నం

షార్ట్స్‌లో చూడండి
'నానిగాడు' సినిమాను విడుదల కాకుండానే యూట్యూబ్ లో పెట్టారని ఆరోపిస్తూ హైదరాబాద్ లోని ఫిల్మ్ చాంబర్ ముందు ఆ సినిమా హీరో దుర్గా ప్రసాద్ ఈ రోజు ఉదయం నిరసనకు దిగిన విషయం తెలిసిందే. తమకు న్యాయం చేయాలని లేకుంటే ఫిల్మ్ చాంబర్ ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించిన ఆయన.. అన్నంత పనీ చేయబోయాడు. ఫిలిం చాంబర్ ముందు పురుగుల మందు తాగాడు.

దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఆయనను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. యూట్యూబ్‌లో సినిమా విడుదల కావడంపై దుర్గాప్రసాద్ తోపాటు 'నానిగాడు' చిత్ర బృందం కూడా ఫిలిం చాంబర్ ముందు ఆందోళనకు దిగింది. తాము 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి, సినిమా తీస్తే దాన్ని య్యూట్యూబ్‌లో పెట్టేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Nani
Hyderabad

More Telugu News