కుటుంబసభ్యులతో కలసి వైసీపీలో చేరుతున్న బీజేపీ నేత!

  • వైసీపీలో చేరాలని మాజీ ఎంపీ గోకరాజు నిర్ణయం
  • రేపు మధ్యాహ్నం తర్వాత జగన్ సమక్షంలో చేరే అవకాశం
  • కుమారుడు, సోదరుడు కూడా వైసీపీలోకే!
ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఈసారి బీజేపీ నుంచి ఓ నేత వైసీపీలో చేరనుండడం ఆసక్తి కలిగిస్తోంది. బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తన కుటుంబసభ్యులతో కలసి రేపు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. గోకరాజు తన కుమారుడు రామరాజు, సోదరుడు నరసింహరాజు సహా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. గోకరాజు రాజకీయవేత్త మాత్రమే కాదు, భారత క్రికెట్లోనూ అనేక పదవులు చేపట్టారు. బీసీసీఐ ఉపాధ్యక్షుడిగానూ, ఆంధ్రా క్రికెట్ సంఘం కార్యదర్శిగానూ వ్యవహరించారు.
Go Back to Shorts
Gokaraju Gangaraju
BJP
YSRCP
Andhra Pradesh
Jagan
BCCI
Cricket

More Telugu News