నేను ఎయిడ్స్ డే శుభాకాంక్షలు చెప్పానన్న పోస్ట్ ఫేక్: నారా లోకేశ్

ఎయిడ్స్ డే సందర్భంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు తాను శుభాకాంక్షలు చెప్పినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పోస్టు ఫేక్ అని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పష్టం చేశారు. పేటీఎమ్ లో వేసే ఐదు రూపాయల భిక్షం కోసం ఎంత నీచానికైనా ఒడిగడతారని మండిపడ్డారు. జగన్ గారు చేతకానివాడు అని ఈ ఆర్నెల్లలోనే తేలిపోవడంతో వైసీపీ సైకో బ్యాచ్ కి పనిపెట్టారని విమర్శించారు. ఎయిడ్స్ రోగం కంటే పెద్ద జబ్బు వైసీపీ సైకో సిండ్రోమ్ అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు. తనను ఇబ్బంది పెట్టేందుకు ఏమీ దొరక్కపోవడంతో ఇలాంటి మార్ఫింగ్ ఫొటోలు, ఫేక్ పోస్టులతో జగన్ గారు శునకానందం పొందుతున్నారని ఆరోపించారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
Andhra Pradesh
YSRCP
Jagan
PAYTM

More Telugu News