మోక్షజ్ఞ తాజా లుక్... పక్కనే 'రూలర్'గా బాలయ్య!
Add ap7am to your home Screen

మోక్షజ్ఞ తాజా లుక్... పక్కనే 'రూలర్'గా బాలయ్య!

  • మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చూస్తున్న ఫ్యాన్స్
  • భార్యా, బిడ్డలతో బాలయ్య చిత్రం
  • సోషల్ మీడియాలో వైరల్
నందమూరి అభిమానులు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ కోసం చానాళ్ల నుంచే ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ సైతం తన కుమారుడు సినిమాల్లోకే వస్తాడని, తన వారసత్వాన్ని కొనసాగిస్తాడని అంటూనే ఉన్నారు. కానీ, అది ఎప్పుడన్నది మాత్రం ఆలస్యం అవుతూనే ఉంది. తాజాగా, మోక్షజ్ఞ తాజా చిత్రం ఒకటి బయటకు వచ్చి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

ఈ చిత్రంలో 'రూల‌ర్'లో తాను కనిపించే లుక్ లోనే బాలయ్య ఉండగా, మోక్షజ్ఞ కాస్తంత లావుగా కనిపిస్తున్నాడు. ఇక ఇదే చిత్రంలో బాలకృష్ణ భార్య వసుంధరతో పాటు కుమార్తె తేజస్విని, అల్లుడు భరత్ కూడా కనిపిస్తున్నారు. ఈ ఫోటో ఎప్పుడు, ఎక్కడ తీశారన్న విషయమై స్పష్టత లేదు. కాగా, మోక్షజ్ఞ ఎంట్రీ 'గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి'తోనే ఉంటుందని తొలుత భావించినా, అది కుద‌ర‌లేదు. ఆపై మోక్షజ్ఞకు సినిమాల్లో నటించడం ఇష్టం లేదని వార్తలు వచ్చాయి.
Balakrishna
Mokshagna
Viral Photo

More Telugu News