కాళ్లు పట్టుకొనే పనిలో బిజీగా ఉండి 'సాక్షి'లో ఈ వీడియో చూడలేదనుకుంటా: విజయసాయి రెడ్డికి బుద్ధా వెంకన్న కౌంటర్
- తెనాలి నుండి పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చారు
- చెప్పులు వేయించి అడ్డంగా దొరికిపోయాడు జగన్
- ఆ వీడియో వైరల్ అవుతుంది
జగన్ బతుకంతా సాక్షి గ్రాఫిక్స్ తో మేనేజ్ చెయ్యడమేనని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. అదే పద్ధతిలో ఉన్న అమరావతిని గ్రాఫిక్స్ అంటూ భ్రమ కల్పించబోయి బొక్క బోర్లా పడ్డారని విమర్శించారు. పెయిడ్ ఆర్టిస్టులు స్వయంగా సాక్షిలోనే 'తెనాలి నుండి తీసుకొచ్చారు' అని చెప్పడంతో తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక జగన్ గారు ఇబ్బంది పడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు.