Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

షార్ట్స్‌లో చూడండి
   *  ఇతరులకు సహాయం చేయడాన్ని తన తల్లిని చూసి నేర్చుకున్నానని చెబుతోంది అందాలతార సమంత. 'తన దగ్గర ఏమీ లేకపోయినా మా అమ్మ ఇతరులకు సాయం చేయడానికి ముందుండేది. అది నన్ను ఎంతో ఇన్స్ పైర్ చేసింది. ఇప్పుడు నేను చేయగలిగే  స్థితిలో కూడా వున్నాను. అందుకే, మా ఫౌండేషన్ ద్వారా సాయం చేస్తున్నాను. నా సినిమా హిట్టయినప్పటి కంటే నేను ఎవరికైనా సాయం చేసినప్పుడే అమ్మ ఎక్కువ ఆనందిస్తుంది' అని చెప్పింది సమంత.    
*  గతంలో అల్లు అర్జున్ హీరోగా 'నా పేరు సూర్య' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు వక్కంతం వంశీ కొంత గ్యాప్ తర్వాత మళ్లీ మరో చిత్రాన్ని రూపొందించడానికి రెడీ అవుతున్నాడు. అల్లు అరవింద్ నిర్మించే చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తాడట. ఇందులో యంగ్ మెగా హీరో ఒకరు నటిస్తారని తెలుస్తోంది.
*  గతంలో పలు తెలుగు చిత్రాలలో నటించిన కన్నడ భామ ప్రణీత ఇప్పుడు హిందీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తాజాగా అజయ్ దేవగణ్ సరసన నటించే ఛాన్స్ పొందింది. హిట్ సినిమా 'హంగామా'కు సీక్వెల్ గా రూపొందే చిత్రంలో ప్రణీత కథానాయికగా నటిస్తుంది.
Go Back to Shorts
Samantha
Allu Arjun
Vamshi
Pranitha

More Telugu News