పవన్ కల్యాణ్ ను మరోసారి టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి 

  • జగన్ పై ప్యాకేజీ స్టార్ విషం కక్కుతున్నారు
  • కుటుంబ పిడికిలి అంటూ కొత్త రాగాన్ని అందుకున్నారు
  • మీ అన్నకు మీరు ఎంపీ టికెట్ ఇవ్వలేదా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. సీఎం జగన్ పై ప్యాకేజీ స్టార్ విషం కక్కుతున్నారని మండిపడ్డారు. కాల్షీట్లు అయిపోవస్తున్నా... ఆయనకు జనాల నుంచి కనీస స్పందన కూడా రావడం లేదని ఎద్దేవా చేశారు. కుటుంబ పిడికిలి అంటూ కొత్త రాగాన్ని అందుకున్నారని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంలో ముగ్గురు పదవుల్లో ఉన్నారని తెలిపారు. మీ అన్న నాగబాబుకు మీరు ఎంపీ టికెట్ ఇవ్వలేదా? అని పవన్ ను ప్రశ్నించారు. గురివింద గింజలా నీతులు చెప్పవద్దని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Pawan Kalyan
Vijayasai Reddy
Jagan
Chandrababu
Telugudesam
Janasena
YSRCP

More Telugu News