Kodali Nani: చంద్రబాబు తీరు వల్లే మేము కూడా ఆ స్థాయిలో విమర్శలు చేయాల్సి వస్తోంది: ఏపీ మంత్రి కొడాలి నాని

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఓ పప్పు చెక్క అని, ఆయన కుమారుడు లోకేశ్ పప్పు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదు స్థాయిలో రాజధానిని నిర్మిస్తామని చెప్పిన చంద్రబాబు... అందులో కనీసం 0.1 శాతమైనా నిర్మించారా? అని ప్రశ్నించారు. ఆరు నెలల్లో ఇంటిని కూడా కట్టలేమని... అలాంటిది రాజధానిని నిర్మించగలమా? అని అడిగారు.

చంద్రబాబు చేసిన పొరపాట్లను తాము చేయడం లేదని చెప్పారు. సీఎం జగన్ మొదలుకుని ఆయన తాత రాజారెడ్డి వరకు అందరినీ విమర్శించడం మొదలు పెట్టింది చంద్రబాబేనని... విమర్శలు మానుకోవాలని తాము ఎన్ని సార్లు చెప్పినా ఆయన వినలేదని అన్నారు. చంద్రబాబు తీరు వల్లే తాము కూడా అదే స్థాయిలో విమర్శలు చేయాల్సి వస్తోందని చెప్పారు. ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారన్న విషయంపై చంద్రబాబు ముందు సమీక్ష చేసుకోవాలని సూచించారు.
Go Back to Shorts
Kodali Nani
Chandrababu
Jagan
Telugudesam
YSRCP

More Telugu News