కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు: పుజారా
- పింక్‌బాల్ తో మ్యాచ్ ఆడాము
- శతకంతో కెప్టెన్ గర్వపడి ఉంటాడు
- అభిమానులతో పెద్ద ఎత్తున మైదానానికి వచ్చారు
ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ అంతగా రాణించలేకపోతోన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ నాలుగు రోజులు కూడా సాగకపోయినా తమకు మంచి అనుభవం మిగలనుందని పుజారా అన్నాడు. డేనైట్ టెస్టును ప్రేక్షకులు కూడా ఆస్వాదిస్తున్నారని ఆయన తెలిపాడు. బంగ్లా ఆటగాళ్ల హెల్మెట్లకు బాల్ తగలడానికి వెలుతురు, పింక్ బాలే కారణాలని ఆయన అభిప్రాయపడ్డాడు. టీమిండియా బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాట్స్‌మెన్ సరిగ్గా ఆడలేకపోతున్నారని చెప్పాడు.